Social 1080×1350 • Multi-page
20-05-2026 BREAKING NEWS 01:55 PM
swarnodayam.com
Telugu Daily News

వడదెబ్బతో దివ్యాంగుడు మృతి.. – ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికుల విజ్ఞప్తి.

వడదెబ్బతో దివ్యాంగుడు మృతి.. – ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికుల విజ్ఞప్తి.
IMG_20260520_135310

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల ఎండలు తీవ్రం కావడంతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన గాజర్ల సతీష్ (45) అనే దివ్యాంగుడు వడదెబ్బ బారిన పడి బుధవారం మృతి చెందారు. గాజర్ల వెంకటయ్య- సుగుణమ్మల కుమారుడైన సతీష్ దివ్యాంగుడే కాకుండా వృద్ధులైన తల్లిదండ్రులు కావడంతో వారి పోషనే కష్టంగా ఉన్న తరుణంలో దివ్యాంగుడైన గాజర్ల సతీష్ వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతి చెందడంతో స్థానికులు అంత్యక్రియలకు చందాలు వేసుకొని నిర్వహించే దుస్థితి నెలకొంది. కడు పేదరికంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న సతీష్ కుటుంబానికి సతీష్ ఆకస్మిక మృతితో కనీసం అంత్యక్రియలు చేసే స్తోమత లేకపోవడంతో స్థానిక కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నేత వేముల గోవర్ధన్, స్థానికులు తలా కొంత ఆర్థిక సాయం చేసి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వడదెబ్బతో మృతి చెందిన గాజర్ల సతీష్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక కౌన్సిలర్, బిఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వడదెబ్బతో మృతి చెందిన గాజర్ల సతీష్(45)

గాజర్ల సతీష్ (ఫైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!