Social 1080×1350 • Multi-page
20-05-2026 BREAKING NEWS 05:44 PM
swarnodayam.com
Telugu Daily News

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.- రైతుల డిమాండ్ల సాధనకు 30న రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి సమరభేరి.- రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.- రైతుల డిమాండ్ల సాధనకు 30న రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి సమరభేరి.- రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260520-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో ఈనెల 30న రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమరభేరి సభను నిర్వహించ తలపెట్టినట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. రైతులకు ఇఛ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ, అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకు పార్టీల కతీతంగా రైతు ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

బుధవారం జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి సభ విజయవంతానికీ కౌలు రైతులు ఉపాధి హామీ హామీ వర్కర్లతో కరీంనగర్ జిల్లాలోని మాన కొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని ఆయా గ్రామాలలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రవాణా, రైతుల సమీకరణ ఏర్పాట్లపై కో ఆర్డినేటర్ లతో వారు సమాక్షించారు. అనంతరం సమర భేరి పోస్టర్, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని,నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.లేకుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రెండు లక్షల ఋణ మాఫీలో సగం మందికే మాఫీ చేసిన ప్రభుత్వం అర్హులైన మిగతా రైతులకు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదని రామారావు ప్రశ్నించారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ద్వజమెత్తారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా రైతుల అకౌంట్లలోనేటికీ పూర్తిగా జమ చేయలేదని, పంటల సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ 4రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా కొనుగోలు కేంద్రంలో దాన్యం నేరుపుతూ కుప్పకూలి రైతులు మృత్యు వాత పడటం, దాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ దాన్యాని తగల బెట్టుకోవడం,ఆత్మ హత్యా యత్ననికి పాల్పడటం, తీవ్రంగా కలచి వేసిందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల దాన్యం అధికారుల పర్యవేక్షణ లేక పోవడం తో మిల్లర్లు కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు ఏడు నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇఛ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ డిమాండ్ల సాధనకు ఈ నెల 30న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కదలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పారునంది కిషన్, బొమ్మెన సమ్మయ్య, ఒడ్నాల బాలింగం, బూస తిరుపతి, బాకారపు వేణు, గోపు సత్యనారాయణ రెడ్డీ, మాడ రాజిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, దొంగల రాములు, కలకుంట్ల సత్యనారాయణరావు, గోపు సత్యనారాయణరెడ్డి, గడ్డి గణేష్, దావు శ్రీనివాస్ రెడ్డి, దాడి కొమురయ్య, ఉమ్మెంతల శ్యామ్ సుందర్ రెడ్డి, గడ్డి పర్శరాములు, సాగర్ రావు, వివిధ మండలాల, గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

చలో కరీంనగర్ వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న రామారావుతో అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!