Social 1080×1350 • Multi-page
20-05-2026 BREAKING NEWS 05:59 PM
swarnodayam.com
Telugu Daily News

టిఆర్ఎస్ జండా పాట ఆవిష్కరించిన కవిత

టిఆర్ఎస్ జండా పాట ఆవిష్కరించిన కవిత
IMG-20260520-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 20: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జండా పండగన మాసొచ్చవాల ప్రారంభం రోజును పురస్కరించుకొని ప్రముఖ రచయిత బుర్ర నటరాజ్ రచించిన అదిగో జండా స్వరాష్ట్ర పాలనకూ..అండా… అమరవీరులా..త్యాగాలకు జోహార్లూ ఈజండా పాటను బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో పోస్టర్ విడుదల చేసారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జండా పండగ ఈనెల 20వ తేదీ నుండి జూన్ నెల 20 వరకు కొనసాగుతుంది అని కార్యకర్తలు జండా పండుగను ఉత్సహంగా నిర్వహించుకోవలని కోరారు. ఈ సందర్బంగా ప్రత్యేక పాటను రచించిన బుర్ర నటరాజ్ ను అభినందించారు. TRS ప్రజలకు కార్యకర్తలకు అమ్మగా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలపక్షాన ఉంటాను అని అన్నారు. గత ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కళాకారులకు పెద్దపీట వేస్తామని అండదండగా ఉంటానని సబ్బండ వర్గాలకు అమ్మగా అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల మనోజ, హుజురాబాద్ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ కూకట్ల సంతోష్ యాదవ్, కొరపల్లి సురేష్, రొంటాల రాజ్ కుమార్, నిమ్మటూరి రమ తదితరులు పాల్గొన్నారు.

బుర్ర నటరాజ్ రచించిన అదిగో జండా స్వరాష్ట్ర పాలనకూ..అండా… అమరవీరులా..త్యాగాలకు జోహార్లూ ఈజండా పాటను హైదరాబాద్ లోని తన నివాసంలో పోస్టర్ విడుదల చేస్తున్న కవిత.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!