Social 1080×1350 • Multi-page
21-05-2026 BREAKING NEWS 04:00 PM
swarnodayam.com
Telugu Daily News

ఎండ తీవ్రతకు రాలిపోతున్న రామచిలుకలు.. – పక్షులకు తాగునీరు అందించాలని జంతు ప్రేమికుల వినతి.

ఎండ తీవ్రతకు రాలిపోతున్న రామచిలుకలు.. – పక్షులకు తాగునీరు అందించాలని జంతు ప్రేమికుల వినతి.
IMG-20260521-WA0068


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుండి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో వడదెబ్బ తగిలి మరణిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన వడ గాలులకు మనుషులే కాదు పశు పక్షులు కూడా ఎండ తీవ్రతకు ప్రాణాలు విడుస్తున్నాయి. గురువారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలో ఎండ తీవ్రతకు ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుక రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది. అంతేగాక పిచ్చుకలు సైతం ఎండ తీవ్రత తట్టుకోలేక మృతి చెందుతున్నాయి. మానవతా దృక్పథంతో ఇంటి సమీపంలో పశుపక్షాదులకు తాగేందుకు నీరు పెట్టాలని మానవతావాదులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ముదిరిన ఎండలు

ఎండ తీవ్రతకు మృతి చెందిన రామచిలుకలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!