Social 1080×1350 • Multi-page
23-05-2026 BREAKING NEWS 06:03 PM
swarnodayam.com
Telugu Daily News

టేకుల శ్రావణ్ మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు ఆయన ఒక వలసవాది..- తిప్పారపు సంపత్ ను అనే నైతిక హక్కు శ్రావణ్ కు లేదు – యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్

టేకుల శ్రావణ్ మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు ఆయన ఒక వలసవాది..- తిప్పారపు సంపత్ ను అనే నైతిక హక్కు శ్రావణ్ కు లేదు –  యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్
IMG-20260523-WA0061

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ రోజు హైదరాబాద్ లో కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేపై, పార్టీకి విరుద్ధంగా ఎస్సి విభాగంలో పదవులు ఇచ్చాడని తిప్పారపు సంపత్ సాక్షాదారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టగా దానిని టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివరణ ఇవ్వకుండా, తన చిల్లర టిడిపి నుండి వలస వచ్చిన వాళ్లతో తిప్పారపు సంపత్ పై పత్రికా ప్రకటన చేయడం సిగ్గుచేటు, తన స్థాయిని దిగజార్చుకోవడమేననీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గత నెలలో మండల అధ్యక్షుల పోస్టులకు కూడా కనీస మూడు సంవత్సరాలు పార్టీలో పని చేయాలని చెప్పడం జరిగిందనీ, వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా వివిధ పార్టీల నుండి వచ్చిన వాళ్లకు కనీస మూడు సంవత్సరాలు పనిచేయని వాళ్లకు కవ్వంపల్లి పదవులు ఇచ్చాడని ప్రజాస్వామ్య బద్దంగా అడగడం జరిగిందన్నారు. దానికి తన చిల్లర గ్యాంగ్ తో తిప్పారపు సంపత్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారనీ, తిప్పారపు సంపత్ కాంగ్రెస్ పార్టీ కోసం బిఆర్ఎస్, బిజెపి పార్టీలతో పోరాడి జైలుకు వెళ్లిన చరిత్ర, టేకుల శ్రావణ్ నీలాగా సిగ్గులేకుండా అధికారం ఎక్కడుంటే అక్కడ పూటకొక పార్టీ మార్చే నాయకుడు కాదు అన్నారు. గత 18 సంవత్సరాల నుండి ఒకే పార్టీ నీ నమ్ముకున్న వ్యక్తి, విద్యార్థి ఉద్యమాల నుండి ఎన్ఎస్ యుఐ నుండి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి అన్నారు. అసలు టేకుల శ్రావణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాదనీ, నీవు ఎక్కడ జెండా మోసినవ్ నీకు ఇచ్చిన కార్యదర్శి పదవి కూడా పార్టీ నిబంధనలకు వ్యతిరేకమే, నీవు కూడా మా పార్టీలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావడం లేదు అన్నారు. శ్రావణ్ నీవు మీ కవ్వంపల్లి ఇద్దరు కూడా మా పార్టీకి వలస వచ్చినారనీ, మళ్లీ ఈ పార్టీలో ఉన్న వ్యక్తులను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారనీ అసలు మీ ఇద్దరిదీ ఏ పార్టీ టిడిపి నుంచి వచ్చారన్నది మర్చి, మా పార్టీలో ఉన్న వాళ్లను మాట అంటే సహించేది లేదు అని హెచ్చరించారు. కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేపై, తిప్పారపు సంపత్ చేసిన ఆరోపణలు తప్పు అయితే మేము కరీంనగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాకుతాం.. మీ కవ్వంపల్లి ది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తాడా..!? బహిరంగ చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!