Social 1080×1350 • Multi-page
24-05-2026 BREAKING NEWS 08:47 PM
swarnodayam.com
Telugu Daily News

ఆకట్టుకున్న శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

ఆకట్టుకున్న శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
IMG-20260524-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక విశేష కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోజున అపూర్వ కలయిక నిర్వహించగా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులు, చదువుకున్న విద్యార్థులు తోటి మిత్రులు అందరూ కలిసి ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులు నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి చదువుల ద్వారా వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానాన్ని మరియు పాఠశాల గొప్పతనాన్ని తలుచుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆటపాటలతో సందడి చేసి గడిపారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 2001- 2002 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!