Social 1080×1350 • Multi-page
26-05-2026 BREAKING NEWS 03:37 PM
swarnodayam.com
Telugu Daily News

“బాల్య వివాహం ఒక సంప్రదాయం కాదు – అది బాల్యంపై జరిగే అన్యాయం”. ‌-మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని

“బాల్య వివాహం ఒక సంప్రదాయం కాదు – అది బాల్యంపై జరిగే అన్యాయం”. ‌-మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని
IMG-20260526-WA0053

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు మహిళా వారోత్సవాల సందర్భంగా బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహం ఒక సంప్రదాయం కాదు – అది బాల్యంపై జరిగే అన్యాయం అని పేర్కొన్నారు. బాలిక చేతిలో పుస్తకం ఉండాలి, పెళ్లి తాళి కాదు అని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే 1098కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సమగ్రంగా బాల్యవివాహాల రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవండి అని సూచించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల నిషేధంలో తామంతా భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన వాల్ పోస్టర్లను అతితుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కిషన్, సిడిపిఓ సుగుణ, డిప్యూటీ డిఎం హెచ్ ఓ జీ శ్రవణ్ కుమార్, వార్డు కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది.

బాల్య వివాహాలపై ప్రతిజ్ఞ చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు..

బాల్యవివాహాలపై రూపొందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!