Social 1080×1350 • Multi-page
26-05-2026 BREAKING NEWS 06:37 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్స్ కు నూతన పిఆర్ సినీ వెంటనే ప్రకటించాలి.- టాప్ర జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్స్ కు నూతన పిఆర్ సినీ వెంటనే ప్రకటించాలి.- టాప్ర జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్.
IMG-20260526-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్స్ కు నూతన పిఆర్ సినీ వెంటనే ప్రకటించాలనీ టాప్ర జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో పట్టణములోని స్థానిక టాప్రా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటి 2023 నాడు అమలులో ఉన్నా డిఏ ను మాత్రమే విలీనం చేస్తూ నూతన పిఆర్ సి ని ప్రకటించి జూలై 2023 నుండి వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలుకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకుండానే ఈ నెల 31 వరకు పెన్షనర్స్ అందరూ నిర్ణీత ఫారంలో వివరాలను అందజేయాలని కోరి, పెన్షనర్లందర్నీ గందరగోళానికి గురి చేయకుండా తక్షణమే మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఈహెచ్ ఎస్ ప్రీమియం ఒక శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము తాను ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల పెన్షనరీ బకాయిలు ఇతర పెండింగ్ బిల్లులు100 రోజుల లోపు చెల్లించబడునట్లు విధి విధానాలను ప్రకటించి తక్షణమే పెండింగ్ బిల్లులన్నింటినీ మంజూరు చేస్తూ పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టా ప్రా హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, టా ప్రా నాయకులు బొంగోని వెంకటయ్య, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గాజర్ల బుచ్చిరాజం, గౌరీశెట్టి సాంబయ్య, కంది రాజిరెడ్డి, తౌటం శ్రీహరి, మేకల మొగిలయ్య, తిరునగరి రమేష్, చాడ సమ్మిరెడ్డి, పరాంకుశం సనత్ కుమార్, నల్ల రాజిరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, కే రమేష్ బాబు, బూర్ల లక్ష్మీనారాయణ, పెదపాటి రమేష్, మంతెన సుదర్శన్, గాజే గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!