Social 1080×1350 • Multi-page
27-05-2026 BREAKING NEWS 08:04 PM
swarnodayam.com
Telugu Daily News

కరాటే పోటీల విజేతలకు పలువురు అభినందనలు

కరాటే పోటీల విజేతలకు పలువురు అభినందనలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జిల్లా కేంద్రంలో రెడ్డి ఫంక్షన్ హాల్ సూపర్ ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని హుజురాబాద్ కు చెందిన గ్లోబల్ శోటోకాన్ కరాటే డు ఇండియా జిల్లా అసోసియేషన్ విద్యార్థులు పథకాలు సాధించాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ తెలిపారు. ఈ పోటీలలో వివిధ కేటగిరీలలో తమ విద్యార్థులు కటాస్ లో 5 గోల్డ్ మెడల్స్, స్పారింగ్ లో 3 సిల్వర్ మెడల్స్.. కటాస్ లో మూడు మెడల్స్ సాధించారని ఆయన తెలిపారు. కాగా పథకాలు సాధించిన విద్యార్థులను బుధవారం ఘనంగా పలువురు శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి ఖాళీక హుస్సేన్, కో ఆప్షన్ సభ్యులు జి జమదగ్ని, నాయకులు వేల్పుల రత్నం, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, ఉప్పు శ్రీనివాస్ పటేల్, కొలిపాక సమ్మయ్య, తులసి లక్షణమూర్తి, నాయకురాలు కరీమా, గోస్కుల మధు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న పలువురు ప్రజాపతినిధులు, అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!