Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 09:21 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజల ఓటు హక్కును కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడాలి. – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వొడితల ప్రణవ్ బాబు.

ప్రజల ఓటు హక్కును కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడాలి. – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వొడితల ప్రణవ్ బాబు.
IMG-20260529-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ తో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కాపాడాలని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సర్ కో ఆర్డినేటర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

సార్ పై వాడ వాడల ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు వెళ్లాలని దానికోసం పోలింగ్ బూత్ ఏజెంట్లు పకడ్బందీగా కృషి చేయాలన్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని దాన్ని అలాగే కొనసాగించాలని, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమని సర్ పేరుతో బీజేపీ చేస్తున్న వాటిని ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు.
హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింట్ బూత్ లలో కాంగ్రెస్ నాయకులు సర్ పై విసృతంగా ప్రచారం చేయాలని కోరారు.

మాట్లాడుతున్న పార్టీ ఇంచార్జ్ ఓడితెల ప్రణవ్ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ ఛైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!