Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 10:48 PM
swarnodayam.com
Telugu Daily News

తాసిల్దార్ కార్యాలయంలో నాగు పాము హల్చల్.. – భయభ్రాంతులకు గురైన అధికారులు, సిబ్బంది.

తాసిల్దార్ కార్యాలయంలో నాగు పాము హల్చల్.. – భయభ్రాంతులకు గురైన అధికారులు, సిబ్బంది.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం నాగుపాము హల్చల్ చేసింది. కార్యాలయం పనివేళలు ప్రారంభం కావడంతో అందరూ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో ఒక నాగుపాము కార్యాలయంలోకి వచ్చింది. పామును చూసిన అధికారులు, సిబ్బంది, ప్రజలు ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అది నేరుగా తాసిల్దార్ కార్యాలయ ఛాంబర్ లోకి వెళ్ళింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా తీవ్రభయాందోళనలకు గురయ్యారు. కార్యాలయ సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలిపించి దానిని బట్టి ఊరవతల వదిలిపెట్టించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!