Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 11:40 PM
swarnodayam.com
Telugu Daily News

రేపే తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల విడుదల

రేపే తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల విడుదల
Oplus_16908288

మధ్యాహ్నం 1 గంట నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మే 29: తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ (TG EdCET 2026) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ (కేయూ) వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 12న నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 29,342 మంది అభ్యర్థులు హాజరయ్యారు. బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన ఈ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!