Social 1080×1350 • Multi-page
31-05-2026 BREAKING NEWS 09:13 PM
swarnodayam.com
Telugu Daily News

మిలిటరీలో ఉద్యోగం పొందిన యువకులకు ఘన సన్మానం

మిలిటరీలో ఉద్యోగం పొందిన యువకులకు ఘన సన్మానం
IMG-20260531-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం మిలటరీలో ఉద్యోగం పొందిన ఐదుగురు యువకులను వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది ఈ సందర్భంగా మిలిటరీలో ఉద్యోగం పొందిన వంశీ, అక్షయ్, పవన్, అరుణ్, వివేక్ లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగం పొందిన యువకులు మాట్లాడుతూ తాము ప్రతిరోజు హై స్కూల్ మైదానంలో మిల్ట్రీకి అవసరమైన వ్యాయామం, రన్నింగ్, ఇతర మెలకువలను రాజిరెడ్డి సార్ వద్ద నేర్చుకున్నామని కష్టపడి ఉద్యోగం పొందామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించి ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, పాక సతీష్, పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఐలయ్య, కొలిపాక శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్, ఆడెపు సురేందర్, హనుమంత చారి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!