Social 1080×1350 • Multi-page
01-06-2026 BREAKING NEWS 05:07 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ధర్నా..

గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ధర్నా..
IMG-20260601-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ హుజురాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా కార్మికులు జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నాయని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా వేతనం పెంచలేదని, ఒకపక్క నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయి వచ్చే 9500 వేతనం చాలీచాలని వేతనంతో కుటుంబాలు వెల్లదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, కార్మికులందరినీ రెండో పీఆర్ సి పరిధిలోకి తీసుకురావాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కేటగిర్ల వారిగనే పనులు చేపించాలని కోరారు. ప్రమాదవశాతు కార్మికుడు డ్యూటీలో మరణిస్తే రూ.20 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే అందించాలని, ఆన్లైన్లో పేర్లు నమోదు లేని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, చనిపోయిన కార్మికుడు కుటుంబానికి దహాన సంస్కారాలకు 30 వేల రూపాయలు అందించాలని, కార్మికులందరికీ పిఎఫ్ ఎస్ఐ సదుపాయం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీ ఆందోళన పోరాటాలకు దిగుతామని శంకర్ తేలిపారు.
కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు ఆకునూరి సుధాకర్, మండల కార్యదర్శి చొప్పదండి బిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు శనిగరపు కొమురయ్య, ఇమ్మడి శ్రీకాంత్, కార్మికులు మనక్క, మాడుగుల ఉమా, మిడిదొడ్డి శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, పంచాయతీ సిబ్బంది..

ఎంపీడీవో సునీతకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!