Social 1080×1350 • Multi-page
02-06-2026 BREAKING NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యారంగ పరిరక్షణకై ఈనెల 5న, ఛలో హైదరాబాద్ విజయ వంతం చేయండి..

విద్యారంగ పరిరక్షణకై ఈనెల 5న, ఛలో హైదరాబాద్ విజయ వంతం చేయండి..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్ లోని సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే ర్యాలీ మరియు ధర్నా పోస్టర్ మరియు కరపత్రం ఆవిష్కరించారు. నేడు స్థానిక హుజురాబాద్ MRC ఆవరణలో డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వినర్ P ఈశ్వర్ రెడ్డి, విద్యా పరిరక్షణ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు వి రత్నం, MEO వి శ్రీనివాస్ తో కలిసి పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతు విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 10%,రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులు కేటాయించాలని, జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. అన్నిప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను బోదించాలని కోరారు. ఈ ధర్నాకు ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. చక్రాదర్, మండల అధ్యక్షులు బి. తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.వెంకటస్వామి, కమిటీ సభ్యులు సిహెచ్. మహేందర్, అల్లి శ్రీనివాస్, చిరంజీవి, బండ శ్రీనివాస్, సత్యారాజాం, ఏం వేణుగోపాల్, ఆదామ్ లు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కరపత్రం, పోస్టర్ ఆవిష్కరిస్తున్న డిటిఎఫ్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!