Social 1080×1350 • Multi-page
02-06-2026 BREAKING NEWS 07:55 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
IMG-20260602-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో విద్యాసంస్థల్లో ఆయా సంస్థల అధిపతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. చౌరస్తాలోని అమర వీరుల స్తూపం వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావాలు కోసం కృషి చేసిన మహనీయులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో రమేష్ బాబు, ఏసిపి కార్యాలయంలో ఏసీపీ మాధవి, రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ వి శ్రీనివాస్, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ టి శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో టౌన్ సిఐ కే కరుణాకర్, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఆర్ సుహాసిని, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎమ్మార్సీలో ఎంఈఓ శ్రీనివాస్, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ జే నరేందర్, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆయా సంస్థల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు జాతీయ పతాకాలను ఎగురవేసి నివాళులర్పించారు.

మున్సిపల్ కార్యాలయం పైన జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది

అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, మొక్కలు నాటి నీళ్ళు పోస్తున్న చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి, పాలకవర్గ సభ్యులు..

డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు

చౌరస్తాలో జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..

ఏరియా ఆసుపత్రిలో జెండా ఆవిష్కరిస్తున్న సూపరిండెంట్ నారాయణరెడ్డి.. పాల్గొన్న డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రవణ్..

తెలంగాణ అమరవీల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!