Telugu Daily News
తాడికల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురిని ఢీ కొట్టింది. అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తులు టాంకర్ డ్రైవర్, క్లీనర్ లను గ్రామపంచాయతీలో బంధించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


