Social 1080×1350 • Multi-page
03-06-2026 BREAKING NEWS 11:47 PM
swarnodayam.com
Telugu Daily News

​నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు. – 120 వాహనాల సీజ్ – ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి

​నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు. – 120 వాహనాల సీజ్ – ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​కరీంనగర్, జూన్ 03: కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా సరైన లేదా మొత్తమే నంబర్ ప్లేట్ లేకుండా టూ వీలర్ వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య మరియు సిబ్బంది నిఘా పెట్టారు.

​ఈ తనిఖీల్లో భాగంగా సరైన నంబర్ ప్లేట్ లేని 120 వాహనాలను తాత్కాలికంగా నిర్బంధించి, ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం నిబంధనలు అతిక్రమించడమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి హెచ్చరించారు. పట్టణంలో రహదారి భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ ఏసీపీ స్పష్టం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!