Social 1080×1350 • Multi-page
05-06-2026 BREAKING NEWS 09:49 PM
swarnodayam.com
Telugu Daily News

మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలి.- మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని

మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలి.- మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని
IMG-20260605-WA0171

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఆమె మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం మన విధి. భవిష్యత్తు తరాలకు అదే మనం ఇచ్చే గొప్ప నిధి అని అన్నారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ చేసిన వారి మవుతామని సూచించారు. పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా నిలిపేందుకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 17వ వార్డు కౌన్సిలర్ ఎండి కాలిక్ హుస్సేన్ మాట్లాడుతూ…. మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ బీ కిషన్, ఎన్విరాన్మెంటాల్ఇంజనీర్ పోలు వినయ్, రాజయ్య, సాయి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
.

మొక్క నాటి నీళ్ళు పోస్తున్న చైర్పర్సన్ రోంటాల సుహాసిని..

మొక్క నాటి నీళ్లు పోస్తున్న కమిషనర్ కిషన్..

మొక్క నాటి మట్టి పోస్తున్న కౌన్సిలర్ ఖలీద్ హుస్సేన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!