Social 1080×1350 • Multi-page
08-06-2026 BREAKING NEWS 09:39 AM
swarnodayam.com
Telugu Daily News

ఆకట్టుకున్న పూర్వాచార్యుల సమ్మేళనం. -విద్యార్థులను తీర్చిదిద్దడంలో కనబరిచిన నైపుణ్యాలను నెమరు వేసుకున్న ఆచార్యులు.

ఆకట్టుకున్న పూర్వాచార్యుల సమ్మేళనం. -విద్యార్థులను తీర్చిదిద్దడంలో కనబరిచిన నైపుణ్యాలను నెమరు వేసుకున్న ఆచార్యులు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో 1969లో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలను హుజురాబాద్ లో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు పనిచేసిన పూర్వ ఆచార్యుల సమ్మేళనము స్థానిక శాస్త్ర స్కూలులో కళ్ళెపు సుధాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వంచారు. ఈ సమావేశంలో మహిళా, పురుష అచార్యులు మొత్తం 70 మంది హజరై ఆత్మీయ పలకరింపులతో ప్రారంభించారు. కాగా పూర్వ విద్యార్థులు కొందరు పూర్వచార్యులను ఘనంగా సత్కరించారు. ఆచార్యులు గత జ్ఞాపకాలు, అనుభవాలను నెమరువేసుకుని ఆనందంగా గడిపారు. దాదాళ్ళు 100 మంది ఉన్నా పూర్వాచార్యులు తమ సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణ కోసం ఒక కమిటినీ ఎన్నుకున్నారు. టి రమేష్ మరియు కస్తురి అంజనాచారి అధ్యక్ష, కార్య దర్శులుగా 12 మందితో కమిటి ఏర్పటైంది. సరస్వతి శాశు మందిర్ కి పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి అందరి సహకారంతో ముందుకు వెళ్దామని అధ్యక్ష కార్యదర్శులు తమప్రసంగంలో పేర్కోన్నారు.

కాగా పూర్వాచార్యుల పాఠశాల అభివృద్ధి కమిటీనీ ఈ విధంగా నియమించుకున్నారు.
గౌరవ అధ్యక్షులు;- కళ్ళెపు సుధాకర్ రావు,
అధ్యక్షులు;- తంగెళ్లపల్లి రమేశ్
ఉపాధ్యక్షులు:- ఇలాసాగరం వీరస్వామి, చెనుమల్ల రమేశ్ , సంయోజక్:- కస్తూరి ఆంజనేయులు
సహ సంయోజక్- సందుపట్ల సదానందం, కోశాధికారులు- పెరక వెంకటేశం – యాళ్ళ రవీందర్ రెడ్డి, సలహా సమితి సభ్యులు-భాగవతుల శ్రీకాంత్ శర్మ, దోనెపల్లి హుస్సేన్, భాషబోయిన చంద్రయ్య,
బొక్కల వీరారెడ్డి, దుర్గాజీ, గొడిశాల చేరాలు,
కాజీపేట శోభ, చందుపట్ల హనుమంతు, ఇనుగాల రాజేంధర్, గుడికందుల స్వరూప, కూర నవీన్ రెడ్డి,
దాచపల్లి పద్మ , గొల్లపల్లి లక్ష్మయ్య, కేసిరెడ్డి కనకారెడ్డి, కంది రాజిరెడ్డిలను ఎన్నుకున్నారు.

పూర్వాచార్యులతో ఎన్నుకోబడిన నూతన కమిటీ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!