Social 1080×1350 • Multi-page
08-06-2026 BREAKING NEWS 02:29 PM
swarnodayam.com
Telugu Daily News

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. – పోలాడి

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. – పోలాడి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నరేండ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయక చేతులెత్తేసిందని రైతు జేఏసీ నేత పోలాడి రామారావు దుయ్యబట్టారు. సోమవారం పోలాడి రామారావు మీడియాతో మాట్లాడుతూ ప్రకటన విడుదల చేశారు. రైతులకు అన్ని పంటలకు 500 రూ. బోనస్ ఇస్తామని ఇవ్వక మాట తప్పారన్నారు. రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతులకు 15 వేలు ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని, రుణమాఫీ అర కొరగా చేసి వదిలేశారన్నారు.
ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ యాసంగి సీజన్ ముగిసినా కేవలం కంటి తుడువుగా రెండు ఎకరాలకే భరోసా డబ్బులు ఇచ్చి 80 శాతం విడుదల చేయక చేతు లెత్తే సిందన్నారు.
దాన్యపు కొనుగోళ్ళలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు.

ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందన్నారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. ప్రభుత్వ పాట శాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నా చర్యలు చేపట్టడం లేదన్నారు, గతంలో గ్రామాల్లో నాటిన చెట్లను ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే వారే కరువైనారన్నారు.
గ్రామాల్లో మంచినీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు అద్వాన్నంగా ఉందన్నారు. రెవిన్యూ రంగంలో జావాబుదారి తనం లేక సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినెట్ పద్ధతి దారుణం అన్నారు, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..
గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారుతున్న చర్యలు లేవన్నారు. పేరుకే సన్న బియ్యం కానీ. సరఫరాలో నాసి రకం జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు.
మహిళల, నిరుద్యోగుల హామీల అమలు పై కనీస దృష్టి పెట్టిక మూలన పడేసిందన్నారు.
డిమాండ్ల సాధనకు తాము 14న కరీంనగర్ లో లక్షలాది మందితో పార్టీల కతీతంగా నిర్వహించే రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా హామీల అమలులో నిర్లక్షాన్ని ఎండ గట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వం పై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తాని రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టస్తున్నా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఇఛ్చిన హామీల అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తామన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!