Social 1080×1350 • Multi-page
08-06-2026 BREAKING NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News

సమస్యల పరిష్కారం కోసమే వార్డు సభలు.. – హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని

సమస్యల పరిష్కారం కోసమే వార్డు సభలు.. – హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని
IMG-20260608-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలో 3, 4, 5, 6, 19, 20, 27వ వార్డుల్లో వార్డు సభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమే ఆయా వార్డుల ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వాటిలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను అధికారుల దృష్టికి ప్రజలు తీసుకువెళ్లగా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, గందె శ్రీనివాస్, దామెర అనూష, బండ సింధుజ, గోస్కుల రాజు, కోయల్ కార్ భారతి, ప్రతాప తార, మేనేజర్ భూపాల్ రెడ్డి, కిరణ్, వినయ్, సాయి, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

వివిధ వార్డులో ఇందిరమ్మ చీరలు అందజేస్తున్న దరఖాస్తుల స్వీకరిస్తున్న చైర్పర్సన్ రోంటాల సుహాసిని, కమిషనర్, కౌన్సిలర్లు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!