Social 1080×1350 • Multi-page
08-06-2026 BREAKING NEWS 09:01 PM
swarnodayam.com
Telugu Daily News

ఐదు గ్రామాల్లో గ్రామ సభలు.. – ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ సభలు. – జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం గీత, ఎంపీడీవో సునీత.

ఐదు గ్రామాల్లో గ్రామ సభలు.. – ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ సభలు. – జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం గీత, ఎంపీడీవో సునీత.
IMG-20260608-WA0092

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ప్రజా పాలనలో భాగంగా సోమవారం హుజురాబాద్ మండలంలోని ఐదు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. మండలంలోని పెద్దపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, రాజపల్లి, రాంపూర్, రంగాపూర్ గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు జరుగగా అధికారులు ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. కాగా రంగాపూర్ గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం గీత గ్రామ సభలో పాల్గొన్నారు. పలు విషయాలను ప్రజలతో ఆమె పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కట్టుకూరి మల్లారెడ్డి, కత్తుల రాజు, కుంట అరుణ, ముషం సునీత, మంతెన సుమలత సురేందర్, హుజురాబాద్ ఎంపీడీవో, తూర్పాటి సునీత, ఐకెపి ఎపిఎం లతా మంగేశ్వరి, వార్డు సభ్యులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

రంగాపూర్ లో గ్రామసభ నిర్వహిస్తున్న దృశ్యం

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!