Social 1080×1350 • Multi-page
10-06-2026 BREAKING NEWS 06:10 PM
swarnodayam.com
Telugu Daily News

మురళీధర్ దేశ్ పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.. – ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

మురళీధర్ దేశ్ పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.. – ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260610-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు, ఓసీ జేఏసీ జాతీయ నేత మురళీధర్ దేశ్ పాండే బుధవారం నాడు హైదరాబాద్ లోని వారి నివాసంలో ఆకస్మిక మరణం చెందడం తెలంగాణ సమాజానికి, ప్రజా సంఘాలకు తీరని లోటని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విచారం వ్యక్తం చేసి నివాళులు అర్పించారు.

బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ నగర తెలంగాణ చౌక్ లో నిర్వహించిన దేశ్ పాండే సంతాప సమావేశంలో దేశ్ పాండే చిత్ర పటానికి ప్రజా నాయకులతో కలసి పోలాడి రామారావు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పోలాడిరామారావు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించి రాజకీయాల కతీతంగా సమాజంలోని అన్ని వర్గాలను ఏక తాటిపైకి తీసుకురావడం లో ఆయన పాత్ర మరువలేనిదని కొని యాడారు.
ఆర్థికంగా వెనుక బడిన ఓసీల్లోని పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ల కోసం ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏళ్లతరబడి జరిగిన ఉద్యమంలో జాతీయ సలహాదారుడిగా ఉదృతంగా పాల్గొన్నారన్నారు. ఈనెల 14న కరీంనగర్ లో రైతు సమస్యలపై నర్వహించే సమరభేరి సభ విజయవంతం చేయడానికి మురళీధర్ దేశ్ పాండే వివిధ జిల్లాలో పర్యటించి రైతులను జాగృతం చేశారని ఆయన ఆకస్మిక మరణం దిగబ్రాంతికి గురయ్యామని పోలాడి భావోద్రాకానికి లోనై కన్నీటి పర్వంతం అయ్యారు.
కళాకారుల సంక్షేమం కోసం కృషి చేసిన సాంస్కృతిక యోధుడిగా చిరస్తాయిగా దేశ్ పాండే నిలిచారన్నారు. జీవితాంతం ప్రజా సేవే ద్యేయంగా భావించిన ఆయన చివరి దశలో అనాదాశ్రమం నడుపుతూ అనాధలకు అండ గా ఉంటూ ఆత్మ విశ్వాసం కలిగించటానికి చేస్తున్న కృషి అద్వితీయం అజరామం అన్నారు.
ఉద్యమ కారుడిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా, కళాకారుల మిత్రుడిగా, మానవతావాదిగా, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో రంగాల్లో తన విశేష సేవలందించిన మురళీధర్ దేశ్ పాండే మరణం యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్తిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాల తరపున ప్రగాడ సానుభూతి తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.
ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని పోలాడి రామారావు సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఆయన జ్ఞాపకాల నిమిత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో తీగల వంతెన ముఖ ద్వారం వద్ద పాండే విగ్రహాన్ని నెలకొలపుతామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర గోశాల సంపర్క్ ఉట్కూరి రాధకృష్ణారెడ్డి, బ్రాహ్మణ ప్రజా సంఘాల జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దీపక్ బాబు, ప్రజా సంఘాల నాయకులు జంపాల నర్సయ్య, ఇల్లందుల తిరుమల, పెండ్యాల కేశవరెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, అండెం రమణారెడ్డి, గుండం భూమయ్య, కొత్తకొండ రవీందర్ రావు, తాటిపల్లి రాజన్న, కొలగూరి రాజేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!