Social 1080×1350 • Multi-page
10-06-2026 BREAKING NEWS 08:09 PM
swarnodayam.com
Telugu Daily News

రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కే భవిష్యత్తు. – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు

రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కే భవిష్యత్తు. – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు
IMG-20260610-WA0155

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకే రాబోయే కాలంలో భవిష్యత్తు అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణo లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ, మండల వార్డు అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అనేక పథకాలపై ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. ప్రతి నాయకుడు క్రింది స్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. బూత్ స్థాయిలో సర్ పై అవగాహన కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తున్నామని, వార్డు, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే బాధ్యత తీసుకోవాలనీ కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, అధ్యక్షురాలు పీ రాధ, మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!