Social 1080×1350 • Multi-page
10-06-2026 BREAKING NEWS 08:14 PM
swarnodayam.com
Telugu Daily News

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన హుజూరాబాద్ నూతన ఆర్డీఓ నాయక్ వాడి జల కుమారి

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన హుజూరాబాద్ నూతన ఆర్డీఓ నాయక్ వాడి జల కుమారి
IMG-20260610-WA0151

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 10: హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీఓ) బాధ్యతలు స్వీకరించిన నాయక్ వాడి జల కుమారి బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జల కుమారి కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని పరిపాలనా అంశాలు, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర విషయాలపై చర్చించారు.
హుజూరాబాద్ డివిజన్‌లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ ఆర్డిఓ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!