Social 1080×1350 • Multi-page
10-06-2026 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు.. – ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

హుజురాబాద్ లో ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు.. – ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
IMG-20260610-WA0165

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
సందర్భంగా టేకుల శ్రావణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు ఏముల పుష్పలత, పర్లపల్లి నాగరాజు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండ నవీన్, నాయకులు శనిగరపు తరుణ్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఎర్ర శ్రీనివాస్, నరేష్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!