Social 1080×1350 • Multi-page
11-06-2026 BREAKING NEWS 06:55 PM
swarnodayam.com
Telugu Daily News

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా సబ్బని రమేష్‌ నియామకం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా సబ్బని రమేష్‌ నియామకం.
IMG_20260611_185355

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు సబ్బని రమేష్ ని భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడిగా నియమిస్తూ రీజినల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ గౌలికర్ ఉత్తర్వులు చేశారు.
భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సబ్బని రమేష్ కి కేంద్ర స్థాయిలో ఈ అవకాశం రావడం పట్ల హుజురాబాద్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణానికి గర్వకారణమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జమ్మికుంటకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఈ సందర్భంగా రమేష్ కలువగా శాలువా కప్పి నియామక పత్రాన్ని అందజేసినట్లు రమేష్ తెలిపారు.

ఈ సందర్భంగా సబ్బని రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డికి, అలాగే పార్టీకి చెందిన ఇతర నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సంస్థ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానని సబ్బని రమేష్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!