Social 1080×1350 • Multi-page
11-06-2026 BREAKING NEWS 09:03 PM
swarnodayam.com
Telugu Daily News

బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి. – బిఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్

బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి. – బిఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్
IMG-20260611-WA0089

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: బిఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని బిఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల 12న జమ్మికుంటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు సర్ పై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తాటిపర్తి జీవన్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ చిరుముళ్ల రాకేష్ పాల్గొంటారని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో బిఆర్ ఎస్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, గందె శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, మొలుగు పూర్ణచందర్,ఎండి గఫార్, బండ నరేష్, పోరెడ్డి శoతన్ రెడ్డి, పుల్లూరి ప్రభాకర్ రావు , తాళ్లపెల్లి శ్రీనివాస్, మంద సతీష్, ధనవర్ష రాజు , ఆర్కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!