Social 1080×1350 • Multi-page
12-06-2026 BREAKING NEWS 08:49 PM
swarnodayam.com
Telugu Daily News

ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – రైతు జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – రైతు జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260612-WA0113

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నరేండ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలను అమలులో నిర్లక్ష్యం వీడి తక్షణమే అమలు చేయాలని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
శుక్రవారం కరీంనగర్ లో ప్రజా సంఘాల నాయకులతో కలసి పోలాడి రామారావు మీడియాతో మాట్లాడారు.

రైతులకు అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రైతు కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు 15 వేలు ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని, రుణమాఫీ అర కొరగా చేసి వదిలేశారన్నారు. ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ యాసంగి సీజన్ ముగిసినా కేవలం కంటి తుడువుగా రెండు ఎకరాలకే భరోసా డబ్బులు ఇచ్చి 80 శాతం విడుదల చేయక చేతు లెత్తేసిందన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తున్న ఈ తరుణంలో ఖరీఫ్ కు రైతు భరోసా నిధుల విడుదలలో ఎలాంటి ప్రకటన చేయక పోవడం వల్ల అన్నదాతల్లో ఆందోళన మొదలైనదన్నారు.
ప్రైవేట్ దళారు వ్యక్తులకు మేలు చేసేందుకు
దాన్యపు కొనుగోళ్ళలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తరుగు రవాణా పేరుతో రూ. 1200 కోట్ల రూపాయలను రైతుల నుంచి నిలువు దోపిడీ చేసిందన్నారు. ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను ఇబ్బబదులకు గురి చేస్తోందన్నారు. డిస్కీమ్ ల పేరుతో విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో నిర్వహించ తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలన్నారు.
రెవిన్యూ రంగంలో జావాబుదారి తనం లేక సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినెట్ పద్ధతి దారుణం అన్నారు. రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారన్నారు. నిరుద్యోగుల హామీల అమలుపై కనీస దృష్టి పెట్టిక మూలన పడేసిందన్నారు.
డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో త్వరలో లక్షలాది మందితో పార్టీల కతీతంగా నిర్వహించే రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా హామీల అమలులో నిర్లక్షాన్ని ఎండ గట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తాని రామారావు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టస్తున్నా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఇఛ్చిన హామీల అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో గర్జనలా ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహారావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రైతు జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!