Social 1080×1350 • Multi-page
12-06-2026 BREAKING NEWS 09:32 PM
swarnodayam.com
Telugu Daily News

పద్మశాలి ముద్దుబిడ్డ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్ సబ్బని రమేష్ కు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఘన సన్మానం

పద్మశాలి ముద్దుబిడ్డ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్ సబ్బని రమేష్ కు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఘన సన్మానం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టాప్రా కార్యాలయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబెర్ గా నియమింపబడిన సబ్బని రమేష్ ని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, తెలంగాణ ఫిలిం అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజర్ (TFTD) సందెల వెంకన్నలు మాట్లాడుతూ హుజురాబాద్ పద్మశాలి ముద్దుబిడ్డ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ సభ్యుడిగా పదవి పొందడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. సభ్యుని రమేష్ గత 20 సంవత్సరాలుగా బిజెపి పార్టీకి చేస్తున్న కృషికి ఫలితంగా వారికి ఈ పదవి లభించడం హుజురాబాద్ కు గర్వకారణమని అన్నారు. అంతే కాకుండా వారి నియామకం వలన హుజురాబాద్ కీర్తి పతాకం రాష్ట్రస్థాయిలో ఎగరవేయడం పట్ల గర్వంగా ఉందని ఉన్నారు. ఇకముందు రమేష్ ఇంతకన్నా రెట్టింపైన ఉత్సాహంతో పార్టీతో పాటు సమాజానికి సేవ చేస్తూ అదే విధంగా ఫిలిం బోర్డు మెంబర్గా మంచి చిత్రాలను ఆదరణ లభించేటట్టుగా చూడవలసిన బాధ్యత వారి పైన ఉందని తెలిపారు. ఫిలిం బోర్డు సెన్సార్ సభ్యుడిగా ఉత్తమ గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్, బీసీ ఆజాది ఫెడరేషన్అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, హుజరాబాద్ డివిజన్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు మార్త రవీందర్, మండల వీరస్వామి, గాజర్ల బుచ్చిరాజు, కుడికాల ప్రభాకర్, గాలి సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, కెఆర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

సబ్బని రమేష్ ను సత్కరిస్తున్న టాప్రా సంఘం, పద్మశాలి సంఘం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!