Social 1080×1350 • Multi-page
14-06-2026 BREAKING NEWS 06:08 PM
swarnodayam.com
Telugu Daily News

ఈ నెల 19న కరీంనగర్ లో యువ సమ్మేళనం విజయవంతం చేయండి.- బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి

ఈ నెల 19న కరీంనగర్ లో యువ సమ్మేళనం విజయవంతం చేయండి.- బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
IMG-20260614-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నరేంద్ర మోడీ ప్రధానిగా 12 ఏళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా BJYM నమో యువ కాంక్లేవ్ పేరుతో యువ సమ్మేళనాలు నిర్వహిస్తుందనీ, ఇందులో భాగంగానే ఈ నెల 19న కరీంనగర్ లో యువ సమ్మేళనం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించడం జరుగుతుందని దీనిని విజయవంతం చేయాలని పిజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

భారతీయ జనతా యువ మోర్చా(BJYM) హుజురాబాద్ అసెంబ్లీ ముఖ్యనాయకుల సమావేశం 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ 12 ఏళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా BJYM నమో యువ కాంక్లేవ్ పేరుతొ యువ సమ్మేళనాలు నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 19న కరీంనగర్ లో యువ సమ్మేళనం కార్యక్రమం పెద్దఎత్తున జరుగనున్నదని ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంజాల మనోజ్, హుజురాబాద్ రూరల్ మండల అధ్యక్షులు నరెడ్ల చైతన్య రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ తూర్పాటి శంకర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, దేవగౌడ్, ప్రదీప్, రాకేష్, నవీన్, హృతిక్, అనిల్, శివనాగరాజు, శ్రీపాల్ రెడ్డి, రమేష్, శ్రీధర్, వినయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

నరెడ్ల ప్రవీణ్ రెడ్డినీ సత్కరిస్తున్న నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!