Social 1080×1350 • Multi-page
14-06-2026 BREAKING NEWS 07:51 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం

ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం
IMG-20260614-WA0078

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆదివారం సిటీ సెంట్రల్ హాల్ లో ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రీయ, జాతీయ పోటీ పరీక్షలల్లో పాల్గొని ర్యాంకులు, సీట్లూ సాధించిన పదవ తరగతి విద్యార్థులు 164, ఇంటర్ విద్యార్థులు 68, జెఈఈ 1, మెడిసిన్ విద్యార్థులు 08, బి.టెక్ 2 విద్యార్థులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎంఈఓ శ్రీనివాస్, ప్రభుత్వ, మాస్క్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎండి ముజాహిద్ హుస్సేన్, కౌన్సిలర్ ఎండి ఖలీద్ హుస్సేన్, ఖిద్మత్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ గఫార్, కార్యదర్శి ఫహీం, సయ్యద్ అబ్ధుల్ కరీం, సలీం, అహమద్, అజ్మతుల్లాఖాన్ , ట్రస్మా పట్టణ అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎం. ప్రసాద్, ఎం. నారాయణరెడ్డి, ఖైరునిసా బేగం, హబీబ్, క్యాస ఉపేందర్, సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంఈఓ విడపూ శ్రీనివాస్..

Oplus_16908288

Oplus_16908288

మాట్లాడుతున్న శాతవాహన పాఠశాల కరస్పాండెంట్ వి వెంకటేశ్వర్లు

హాజరైన ప్రతిభావంతులు వారి తల్లిదండ్రులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!