Social 1080×1350 • Multi-page
14-06-2026 BREAKING NEWS 08:22 PM
swarnodayam.com
Telugu Daily News

చిలుకమారి రిశిక కు ప్రతిభా పురస్కార్ అవార్డ్

చిలుకమారి రిశిక కు ప్రతిభా పురస్కార్ అవార్డ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డిగ్రీ, ఎంసీఏ ప్రథమ సంవత్సరంలో విశేష ప్రతిభ చూపిన హుజురాబాద్ కు చెందిన చిలుకమారి రిశిక కు పోపా ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కార్ అవార్డ్ ను అందజేశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ చైర్మన్ దూడం వెంకటరమణలు రిశిక కు అవార్డ్ తో పాటు షీల్డ్ అందజేశారు. అలాగే మరికొంత మంది స్టూడెంట్స్ కి కూడా అందజేశారు. హుజురాబాద్ కు చెందిన పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగులను పద్మ రత్న అవార్డ్ లతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీయులు అన్నీ రంగాలలో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కు చెందిన నాయకులు, ఉపాధ్యాయులు, చైర్మన్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్షులు పోలు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చిలుకమారి రిశిక ను ప్రతిభా పురస్కార్ అవార్డ్ తో సత్కరిస్తున్న పోపా నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!