Social 1080×1350 • Multi-page
16-06-2026 BREAKING NEWS 03:25 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదు. – కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదు. – కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ విద్యా సంవత్సరం మొదలైన తరుణంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసినట్లయితే ఊరుకోమని, అదేవిధంగా పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు విక్రయించినట్లయితే భౌతిక దాడులకు సైతం దిగుతామని హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై మోయలేని భారం వేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలు బే ఖాతరు చేస్తూ వివిధ పాఠశాలలు నర్సరీ నుండి పదో తరగతి వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వం కూడా దృష్టి సారించారని తెలిపారు. ప్రభుత్వం నుండి సరైన ఫీజులు పట్టిక జీవో విడుదల అయ్యే వరకు వేచి ఉండాలని ఒకవేళ ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే ఆయా పాఠశాలల వద్ద ఆందోళన మరియు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెంది పాఠశాల యాజమాన్యాలు చెప్పిన విధంగా ఫీజులు కట్టవద్దని అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయించవద్దని సూచించారు. ఒకవేళ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసి పాఠ్య పుస్తకాల పేరిట మరియు ఫీజుల పేరిట అడ్మిషన్ ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లయితే జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని పలు నిరసన కార్యక్రమాలు తెలుపుతామని శ్రవణ్ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!