Social 1080×1350 • Multi-page
16-06-2026 BREAKING NEWS 03:59 PM
swarnodayam.com
Telugu Daily News

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి.. – చేల్పూర్ పీహెచ్ సి ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం.

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి.. – చేల్పూర్ పీహెచ్ సి ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం.
IMG-20260616-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలనీ జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డిఎంహెచ్ఓ హుజురాబాద్ డాక్టర్ ప్రభుదాస్ తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ల్యాబ్ మరియు ఫార్మసీ ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని, నార్మల్ డెలివరిస్ ని అయ్యేటటట్లు ప్రోత్సహించాలని, డయాబెటిస్ హైపర్ టెన్షన్ రోగులకు ప్రైవేటు మందులను కాక ప్రభుత్వ మందులను వాడేటట్లు చూడాలని ఆదేశించారు. వర్షాకాలం రాబోతుంది కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని ఆదేశించారు. ఈరోజు నుండి పక్షం రోజులు డయేరియా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ఆశా కార్యకర్తలు ORS ప్యాకెట్లను డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, డాక్టర్ రాజేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!