Social 1080×1350 • Multi-page
16-06-2026 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

పిల్లల అభివృద్ధి కోసం కృషి…డి.ఈ.ఓ ప్రశాంత్ రెడ్డి.. – కన్నుల పండువగ అక్షరాభ్యాసం.

పిల్లల అభివృద్ధి కోసం కృషి…డి.ఈ.ఓ ప్రశాంత్ రెడ్డి.. – కన్నుల పండువగ అక్షరాభ్యాసం.
IMG-20260616-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పిల్లల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాటలో కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసినితో కలిసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతుందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థినీ విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, వారికి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ రంగంలో విద్యారంగం అభివృద్ధి చెందడానికి ముందుకు రావాలన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని మాట్లాడుతూ…అక్షరాభ్యాసం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, పిల్లల విద్యా జీవితానికి తొలిమెట్టు ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోయల్ కార్ భారతి, సొల్లు సునీత, హెచ్ఎంలు డిఎం శోభారాణి, గోగుల రాధిక, విజయలత, మొగిలి, ఝాన్సీ, వాణి, సిఆర్పి దామోదర్ అమరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులతో అక్షరాభ్యాసం చేస్తున్న డీఈవో, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, ఎంఈఓ శ్రీనివాస్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!