Social 1080×1350 • Multi-page
16-05-2024 BREAKING NEWS 02:24 AM
swarnodayam.com
Telugu Daily News

సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ నేతల ధర్నా

హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద యోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేక విధానానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తదని బండ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రేస్ ప్రభుత్వం మరోసారి రైతన్నలను మోసం చేసిందని మండిపడ్డారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ని రైతులే త్వరలో గద్దె దించుతారని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ 500 చెల్లించాలని, మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జెడ్పిటిసి పడిదం బక్కారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గూడూరి ప్రతాపరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!