Social 1080×1350 • Multi-page
18-06-2026 BREAKING NEWS 07:33 PM
swarnodayam.com
Telugu Daily News

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్ష-మద్దతు తెలిపిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్ష-మద్దతు తెలిపిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు
IMG-20260618-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ… కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని రెండవ పిఆర్సిని ప్రకటించాలని, కనీస వేతనం రూ.26,000 నిర్ణయించి కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించాలి కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కల్పించాలని అన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, విలీన గ్రామాల కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎండి అజ్జు, ప్రధాన కార్యదర్శి బోరగాల కుమార్, ఉపాధ్యక్షులు రాసపల్లి సరోజన, అన్నపూర్ణ, క్రాంతి కుమార్, సులోచన, రాజేశ్వరి, టి కుమార్, కుమార్ , భాగ్యం, సుశీల, బోరగాల బొందయ్య, ములుగు వినోద, స్వామి, సంపత్, లక్ష్మి, జయ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు
.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!