Social 1080×1350 • Multi-page
19-06-2026 BREAKING NEWS 03:44 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు
IMG_20260619_154225

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత నవ యువకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు శుక్రవారం శాలపల్లి- ఇంద్రనగర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాజీపేట శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నది అన్నారు. స్వాతంత్ర ఉద్యమ పార్టీగా అన్ని వర్గాల ప్రజలకు యోగ్యమైన పథకాలు ప్రవేశపెట్టి భారత్ ను ముందు వరుసలో నిలిపారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం కొన సాగుతుందన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన నేరెళ్ల మహేందర్ గౌడ్ కి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జడల అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల విజయ్ కుమార్, మాజీ ఎంపిటిసి గద్దల లలిత- జయరాజు, మాజీ ఉపసర్పంచ్ విద్యాసాగరరెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు లావణ్య, కన్నెబోయిన మహేందర్ యాదవ్, మీ అరకుటు విష్ణు సతీష్, తిరుపతి, కంది నరసింహారెడ్డి, కాల్వ సాంబశివరెడ్డి, రైతు నారాయణ, ఇనుముల రవీందర్, రాజు, ధనలక్ష్మి, సరిత, రాణి, స్వరూప, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!