Social 1080×1350 • Multi-page
19-06-2026 BREAKING NEWS 07:35 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.. – హుజురాబాద్ ఏసీపీ మాధవి

విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.. – హుజురాబాద్ ఏసీపీ మాధవి
IMG-20260619-WA0059

–విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు ధూమపావనం, మద్యపానాలు నిషేధం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు శుక్రవారం హుజురాబాద్ లోని విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న పలు పాన్ షాపులు, కిరణం షాపులను పోలీసులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసిపి మాధవి హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యా సంస్థలకు వంద మీటర్ల లోపు ఉన్న షాపుల వద్ద నిలువ ఉంచిన మత్తు పదార్థాలకు చెందిన సిగరెట్, గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విద్యాసంస్థల పరిధిలో ఎవరైనా మత్తు పదార్థాలకు సంబంధించిన విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హుజురాబాద్ పట్టణ సీఐ కరుణాకర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలో పాఠశాలలకు దగ్గరగా ఉన్నా పాన్ షాపులు, కిరణ షాప్ లను తనిఖీ చేస్తున్న ఏసీబీ మాధవి, సిఐ కరుణాకర్, సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!