Social 1080×1350 • Multi-page
20-06-2026 BREAKING NEWS 08:05 PM
swarnodayam.com
Telugu Daily News

బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులుగా మహేందర్

బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులుగా మహేందర్
IMG-20260620-WA0082

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులుగా హుజురాబాద్ మండలంలోని జూపాక గ్రామానికి చెందిన గీన్నారపు మహేందర్ నియామకం అయ్యారు. మహేందర్ గతంలో బీఎస్పీలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా పని చేశారు. చాన్నాళ్లుగా బిఎస్పీలో కీలకంగా పని చేస్తున్న మహేందర్ ను హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులుగా నియామకం చేశారు. అయితే మహేందర్ జూపాక గ్రామ ఉపసర్పంచ్ గా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బిఎస్ పి ని బలోపేతం చేసి గ్రామ గ్రామాన నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తనను నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించేందుకు కృషిచేసిన పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకి మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!