Social 1080×1350 • Multi-page
20-06-2026 BREAKING NEWS 09:37 PM
swarnodayam.com
Telugu Daily News

పాఠశాలలో ముందస్తు యోగా దినోత్సవం వేడుకలు.. – ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ఆసనాలు

పాఠశాలలో ముందస్తు యోగా దినోత్సవం వేడుకలు.. – ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ఆసనాలు
IMG-20260620-WA0094

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని శనివారం హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రభుత్వ బాలుర పాఠశాల తోపాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు యోగ మాస్టర్ల యోగ పిల్లలతో చేయించారు. యోగాతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎంఈఓ విడపు శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం శోభారాణి, తిరుమల సమ్మిరెడ్డి, సంజీవ్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో…

స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం తుమ్మనపల్లిలోని ఏకశిలా పాఠశాలలో ఘనంగా నిర్వహిoచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, SFD స్టేట్ కో కన్వీనర్ గోస్కుల అజయ్ మాట్లాడుతూ ఈ రోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఒక గొప్ప జీవన విధానం అన్నారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు అన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తుంది అని పేర్కొన్నారు.

ఏకశిల పాఠశాల యోగాసనాలు చేస్తున్న విద్యార్థులు..
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి అని, 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. విద్యార్థులందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కన్వీనర్ కూసాల విష్ణు, నగర సంయుక్త కార్యదర్శి రామ్ చరణ్, అరుణ్, నగరు ఉపాధ్యక్షులు సిద్దు, పాఠశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఏకశిలా పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల యోగాసనాలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!