Social 1080×1350 • Multi-page
20-06-2026 BREAKING NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News

పాఠశాలలు మార్గదర్శకాలు పాటించాలని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఈఓకు వినతి

పాఠశాలలు మార్గదర్శకాలు పాటించాలని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఈఓకు వినతి
IMG-20260620-WA0075

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో మండలంలోని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం హుజూరాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ కు
బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

అనంతరం బీసీ ఆజాద్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ మాట్లాడుతూ…. హుజురాబాద్ లోని కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. అధిక పుస్తకాల రేటుతో తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్నారని దీనిని అరికట్టాలన్నారు. తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధిక లాభాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ లాభాపేక్షతో వ్యవహరించే సంస్థలను ప్రభుత్వం ఉపేక్షించ కూడదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, రఘువర్ధన్, శ్రీ కృష్ణ, రమేష్, అక్షయ్, భరత్ తదితరులు పాల్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!