Social 1080×1350 • Multi-page
21-06-2026 BREAKING NEWS 04:43 PM
swarnodayam.com
Telugu Daily News

యువజన హక్కుల కోసం ఉద్యమిద్దాం.. – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటిని వెంటనే భర్తీ చేయాలి. – సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

యువజన హక్కుల కోసం ఉద్యమిద్దాం.. – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటిని వెంటనే భర్తీ చేయాలి. – సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
IMG_20260621_164100

—గ్రామ గ్రామాన యువజన సంఘాన్ని బలోపేతం చేయాలి

—సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 21: యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కుల సాధనకై అనునిత్యం పోరాటాలు చేయాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇందిరానగర్ లో పోలోజు రంజిత్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్ని వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మేము వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత 12 సంవత్సరాలకు పైగా యువతను మోసం చేస్తూ వస్తుందని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మాట
ఎత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏటా కోటి ఉద్యోగాలన్న మోడీ నేటికీ దాని అమలు పరచకపోవడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే యువజన వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని యువతకు పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్ )రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్ల పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. గతంలో నిరుద్యోగులకు ఉపాధి చేసుకోవడం కోసం లోన్లు ఇచ్చి ఉపాధి కల్పించేవారని ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినటువంటి యువతకు ఉద్యోగం,ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా యువతను మరిచిపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపించేందుకు అఖిల భారత యువజన సమాఖ్య కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని యుగంధర్ అన్నారు.

ఏఐవైఎఫ్ ను హుజురాబాద్ నియోజకవర్గం లో గ్రామ గ్రామాన బలోపేతం చేసి ప్రతి గ్రామంలో యువతను ఐక్యపరచి సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలని యుగంధర్ కార్యకర్తలను కోరారు.

ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు రత్నాకర్, AIYF నియోజకవర్గ నాయకులు జెట్టి లావణ్య, మొడెం శివకుమార్, ప్రశాంత్, రాకేష్, మహేందర్, శివకుమార్, సదానందం, ఫర్జానా, రామంచ శ్రావణ్, అకినపల్లి సందీప్, కోల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!