Social 1080×1350 • Multi-page
21-06-2026 BREAKING NEWS 06:10 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

హుజురాబాద్ లో ఘనంగా పోచమ్మ బోనాలు
1005796653

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఆదివారం రోజున కల్లు గీతా కార్మిక కుటుంబాలు ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. అలాగే సోమవారం జోగు, మంగళవారం రోజున ఎల్లమ్మ బోనాలు, బుధవారం అమ్మవారి మొక్కుబడులు నిర్వహించడం జరుగుతుందని గౌడ సంఘ అధ్యక్షులు శ్రీపతి కుమార్ తెలిపారు. ఈ ఉత్సవానికి హుజురాబాద్ ప్రాంత వాసులే కాకుండా చుట్టూ పక్క గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కుబడులు చెలించుకుంటారని తెలిపారు. ఈ వేడుకల్లో ఆయనతోపాటు కార్యవర్గ సభ్యులు శ్రీపతి ఎల్లయ్య, పంజాల శ్రీధర్, శ్రీపతి ప్రసాద్, పంజాల సతీష్, పూదరి రవీందర్, తాళ్లపెల్లి సుదర్శన్, కెక్కెర్ల సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా గౌడ యూత్ కమిటీ..
ఈ సారి జాతరను ఘనంగా నిర్వహించడానికి గౌడ యూత్ కమిటీ ప్రత్యేక సేవలను అందించడం జరుగుతుంది. అందరు కలిసి కట్టుగా పని చేసి జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడానికి తమ వంతు సహకారంతో పాటు జాతరలో ప్రత్యేకంగా సేవలను అందిస్తూ అందరి దృష్టిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!