Social 1080×1350 • Multi-page
21-06-2026 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్‌ను ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. పలువురిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి

హుజూరాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్‌ను ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. పలువురిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
IMG_20260621_191759

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు.

బస్ స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

బస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన మంత్రి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల నిర్వహణ, సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం మాత్రమే కాకుండా, మహిళలను బస్సుల యజమానులుగా చేస్తుంది అని తెలిపారు.

మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి ముందుకు సాగేందుకు అవసరమైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

బస్టాండ్ లో ప్రయాణికులను, ఆర్టీసీ ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టిసి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!