Social 1080×1350 • Multi-page
21-06-2026 BREAKING NEWS 09:17 PM
swarnodayam.com
Telugu Daily News

23న పాఠశాల బంద్ విజయవంతం చేయాలి.. – ఏబీవీపీ ఎస్ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్

23న పాఠశాల బంద్ విజయవంతం చేయాలి.. – ఏబీవీపీ ఎస్ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్
IMG-20260621-WA0134

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని, హాస్టల్లకు పక్కా భవనాలు నిర్మించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాల బంద్ ను విజయవంతం చేయాలని ఏబీవీపీ ఎస్ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలకు 23 వేల పాఠశాలలను మూసివేసి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు . ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు మెరుగుపరుస్తూ సాంఘిక సంక్షేమ హాస్టల్ కు పక్కా భవనం నిర్మించి గురుకులల్లో బస్సులను మరింత నాణ్యవంతమైన వసతి అందించాలని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను వసూలు చేస్తూ పాఠశాల కేంద్రంగా పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బందులో ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా పాల్గనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శి అజయ్, నగర ఉపాధ్యక్షులు సాయితేజ, అయాన్, సాయి చరణ్, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!