Social 1080×1350 • Multi-page
22-06-2026 BREAKING NEWS 11:48 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ లో వాల్టా చట్టానికి తూట్లు.. – అక్రమంగా చెట్ల నరికివేత

చెల్పూర్ లో వాల్టా చట్టానికి తూట్లు.. – అక్రమంగా చెట్ల నరికివేత
IMG_20260622_233417

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చేల్పూర్ గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి బంధువు వాల్టా చట్టానికి తూట్లు పొడిచారు. మొక్కలు నాటాలి, చెట్లను సంరక్షించాలని ఒకపక్క ప్రభుత్వం మొత్తుకుంటుండగా.. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజాప్రతినిధి బంధువు పచ్చని చెట్టుపై గొడ్డలి వేటు వేశాడు. అంతేగాక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పచ్చని చెట్టును ఎవరికి తెలపకుండా అక్రమంగా నరికించి ఎంతో విలువైన ఆ చెట్టు కలప సొమ్మును దిగమింగాడు. ఈ విషయమై గ్రామానికి చెందిన కొందరు అతనిని నిలదీసి అడగగా చెట్టు ఎండిపోవడంతో నిరుపయోగంగా ఉందని తొలగించడం జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కోసం మెరుపు. అయితే నిన్న మొన్నటి వరకు పచ్చటి ఆకులతో కళకళలాడిన పచ్చని ఆ టేకు చెట్టును నరికివేసి కనీసం సదరు పాఠశాల అధికారులకు, ఉద్యోగులకు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయమై సదరు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులను పత్రిక సోదరులు అడగగా తమకు తెలియకుండానే గ్రామ ప్రజాప్రతినిధి భర్త ఇలా తొలగించాడని సమాధానం చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా అక్రమంగా పచ్చని చెట్లను నరికివేసిన సదరూ ప్రజాప్రతినిధి బంధువుపై వాల్టా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం పచ్చటి ఆకులతో కళకళలాడుతున్న టేకు చెట్టు (ఫైల్ ఫోటో)

వాల్టా చట్టానికి వ్యతిరేకంగా అనుమతి లేకుండా పాఠశాలలో నరికి వేసిన టేకు చెట్టు..

నరికి పారేసిన టేకు చెట్టు పచ్చనీ కొమ్మలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!