Social 1080×1350 • Multi-page
23-06-2026 BREAKING NEWS 08:50 PM
swarnodayam.com
Telugu Daily News

శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగం మరువలేనిది. – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగం మరువలేనిది. – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
IMG-20260623-WA0114

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మహనీయులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగం మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ వేడుకను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా శామ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ “ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం” ఉండాలనే లక్ష్యంతో అహర్నిశలు పోరాడిన గొప్ప దేశభక్తుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు.దేశ సమగ్రతను కాపాడటంలో శ్యామా ప్రసాద్ చేసిన పోరాటం, ప్రాణత్యాగం భారత రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. దేశ సమగ్రత కోసం, జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదని (ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేంగే) పోరాటం చేస్తూ 1953 జూన్ 23న ఆయన కస్టడీలో ప్రాణాలు అర్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను , ఆశయాలను మోడీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఆ దిశలోనే ఆర్టికల్ 370 రద్దు చేసి మోడీ ప్రభుత్వం డాక్టర్ శ్యామ ప్రసాద్ కు ఘనమైన నివాళులు అర్పించిందన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, కార్యక్రమ జిల్లా కో కన్వీనర్ పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ కన్వీనర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సెంటర్ ఫిలిం బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు మంచికట్ల మురళి, కొలుగూరి అనిల్, పడారి సుమన్, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, బోరగాల సారయ్య, కొయ్యడ శ్రీనివాస్, పడారి కొమురయ్య, కొలిపాక వెంకటేష్, గుర్రం సంతోష్, మొలుగూరి నగేష్, ఎర్ర శ్రీధర్, బోడిగే రాధ, మోటపోతుల రాకేష్, యాట రాజేష్, నీలం రవీందర్, ఐత సందీప్, క్యాస వెంకటేష్, కొడిమ్యాల పవన్, వోడ్నాల విజయ్, అనంతుల విక్రమ్, పర్థం విజయ్, వీరయ్య, గంధం సంతోష్, తూర్పాటి అరవింద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!